Vedika Media

Vedika Media

vedika logo

BRS పార్టీలో వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు? కానీ వీళ్ళు మాత్రం చెలరేగిపోతున్నారు?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాడి దాదాపు 10నెలలు కావొస్తుంది. కానీ ఇచ్చిన హామీలు నిలపెట్టుకోవట్లేదు అని తెలంగాణలో ఎవరిని అడిగిన ఇదే మాట చెబుతారు. కానీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి గతం లో పదవులు అనుభవించిన వారు ఎవరు ముందుకు రావట్లేదు కానీ brs పార్టీ సొషల్ మీడియా వారు మాత్రం అడుగడునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

 

రాష్ట్ర అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకే చెల్లిస్తున్నాము అని చెబుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వారు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టి brs పార్టీనీ విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ గా brs పార్టీ సోషల్ మీడియా వారు గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీ ఎంత కడుతున్నారు అనే విషయాలను ప్రూఫ్ తో సహా కౌంటర్ ఇస్తున్నారు. దింతో సామాన్య ప్రజలకి ఎవరిదీ రైట్ ? ఎవరిదీ రాంగ్ అనే విషయాలు అర్ధం అవుతున్నాయి. 

ఈ ఒక్క అంశం మాత్రమే కాదు ఉద్యోగాలు, ప్రభుత్వ స్కూల్స్, డెవలప్మెంట్ ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో ప్రూఫ్ పెట్టి ఎదుటి వారికీ కౌంటర్ ఇస్తున్నారు. కానీ వీరందరూ brs పార్టీ అసలైన కార్యకర్తలు, పార్టీ కోసం వివిధ పట్టణాల్లో ఉంటూ పని చేస్తారు. 

 

అయితే గత 10 సంవత్సరాలు వివిధ పదవులు అనుభవించిన వారు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. వీళ్లకు పదవులు తప్ప పార్టీ అవసరం లేదు అని తెలుస్తుంది. పార్టీ అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీ కోసం పని చేయాలి, వివిధ సమస్యలపై ఆదారాలతో సహ సమాధానం చెప్పాలి. అంతే కానీ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పి సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు అని పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. 

 

కెసిఆర్ కూడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సంవత్సరం టైమ్ ఇచ్చారని తెలుస్తుంది. ఏ ప్రభుత్వం ఐన వచ్చిన వెంటనే అన్ని పతకాలు అమలు చేయరు. ఒక సంవత్సరం టైమ్ తీసుకుంటారు. అందుకే కెసిఆర్ బయటికి రావట్లేదు అని తెలుస్తుంది. దింతో పార్టీ కార్యకర్తలు స్వచ్చందంగా సోషల్ మీడియాలో ప్రూఫ్ లతో సహా ఎదుటి వారికి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి 10 సంవత్సరాలు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. దీనిని బట్టి brs పార్టీ అధిష్టానానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

 

Leave a Comment

Vedika Media