హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” మూవీ టీమ్ అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా “రామ.. రామ..” అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. పాటలో హనుమంతుడి భక్తి, వైభవం, శ్రీరాముడి మహిమలను అత్యద్భుతంగా వివరించారు. చిరంజీవి వాయిస్‌లో వినిపించే “జై శ్రీరామ్” చాంత్రాణంగా నిలుస్తోంది.

బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న “విశ్వంభర” చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి హనుమంతుడికి అంకితభావంతో ఉన్న భక్తుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ మెగా ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచగా, ఈ పాట విడుదల మరింత హైప్ తీసుకొచ్చింది.
ఈ పాటలో రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, ఎంఎం కీరవాణి సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. “రాములోరి గొప్ప చెప్పుకుందామా.. సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా..” లాంటి లైన్స్ వినసొంపుగా ఉన్నాయి. పాటను చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటను మెచ్చుకుంటూ పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు.