విరాట్ కోహ్లీని కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. వీడియో వైరల్
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ లో ఆడుతున్నారు. ఈ సందర్భంగా అతనిని చూసేందుకు అభిమానులు తరలిపోతున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలిసేందుకు ఒక అభిమాని స్టేడియం భద్రతా వలయాన్ని ఛేదించి మైదానంలోకి దూసుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్‌లో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. కోహ్లీని చూసేందుకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా క్యూ వేసిన అభిమానులు ఎప్పటికప్పుడు అతన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో, రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 12వ ఓవర్ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని విరాట్ కోహ్లీ పాదాలకు నమస్కరించాడు. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని గమనించి వెంటనే ఆ అభిమాని దృశ్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ, విరాట్ కోహ్లీ ఈ ఘటనపై స్పందిస్తూ భద్రతా సిబ్బందిని అభ్యర్థించి అతనిని కొట్టకూడదని, తిట్టకూడదని చెప్పాడు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.