టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్, ‘పెళ్లి చూపులు’తో హీరోగా పరిచయమై, ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో టాప్ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండగా, దీనికి ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది SVC బ్యానర్‌లో 59వ చిత్రం కానుండగా, భారీ పాన్-ఇండియా రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.

ఈ చిత్రానికి సంబంధించి ఆడిషన్లను అధికారికంగా ప్రకటించారు. 25-65 ఏళ్ల మేల్, 25-60 ఏళ్ల ఫీమేల్ ఆర్టిస్టులు, 5-14 ఏళ్ల బాయ్స్, 5-12 ఏళ్ల గర్ల్స్ నటనలో ఆసక్తి ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఆడిషన్స్ వివరాలు:
- కాకినాడ: హోటల్ శ్రీవత్స – ఫిబ్రవరి 15
- రాజమండ్రి: హోటల్ సూర్య – ఫిబ్రవరి 17
- భీమవరం: హోటల్ గ్రాండ్ లీల కృష్ణ – ఫిబ్రవరి 19
ఇదొక గొప్ప అవకాశం కావడంతో నటనలో ఆసక్తి ఉన్నవారు తప్పక పాల్గొనవచ్చు. ఇకపోతే, విజయ్ దేవరకొండ 12వ సినిమాను నాగవంశీ నిర్మిస్తుండగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తన యూనిక్ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే డైరెక్టర్. తాజా సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇటీవల మహా కుంభమేళలో ప్రత్యక్షమవ్వడంతో, విజయ్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటనలో మక్కువ ఉన్నవారికి ఇది ఓ గోల్డెన్ ఛాన్స్! మీ టాలెంట్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉండండి.