బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’ అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. గత నెల హిందీలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఘన విజయం సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, మహారాష్ట్ర యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 14న విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది.

ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈనెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో, చిత్రయూనిట్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

తాజాగా రిలీజ్ అయిన ‘ఛావా’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 3 నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌కు నెట్టింట అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో, సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.