వేసవి రాగానే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్లకు ఇదొక అద్భుతమైన సమయం. మీరు తొలిసారి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, టూరిజాన్ని అమితంగా ఇష్టపడేవారైనా, ఈ ప్రదేశాలు మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం లేదు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, చల్లటి సముద్ర తీరాలు, వినోదభరితమైన షాపింగ్, భక్తి స్థలాలు, సాహస ప్రయాణాల కలయికను ఆస్వాదించేందుకు ఈ లొకేషన్లు బెస్ట్. ముఖ్యంగా, ఈ ప్రదేశాల అందరికీ కామన్ అంశం బీచ్‌లు.

1. వర్కలా
ఈ వేసవిలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో వర్కలా ఒకటి. ఇక్కడ బీచ్‌లో సూర్యోదయాలు, సాయంత్రపు చల్లటి గాలులు మీ హృదయాన్ని హత్తుకుంటాయి. వర్కలా బీచ్‌కి ‘పాపనాసం బీచ్’ అనే పేరు కూడా ఉంది. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. జనార్ధన స్వామి ఆలయం ఇక్కడ ముఖ్య ఆకర్షణ. ఈ ఆలయం కేరళలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది.
2. వాయనాడ్
పశ్చిమ కనుమల మధ్యలో అద్భుతంగా విరాజిల్లే వాయనాడ్, ప్రకృతి ప్రేమికులందరికీ ఒక గొప్ప పర్యాటక కేంద్రం. ఇక్కడి చల్లటి వాతావరణం మానసిక, శారీరక ప్రశాంతతను కలిగిస్తుంది. ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ లవర్స్‌కి ఇది బెస్ట్ ప్లేస్. కుటుంబంగా, హనీమూన్ కపుల్స్‌గా, ఒంటరి ప్రయాణికులుగా వెళ్లేందుకు పర్ఫెక్ట్ డెస్టినేషన్.
3. ఊటీ
భారతదేశంలోని అత్యుత్తమ హిల్ స్టేషన్లలో ఊటీ ఒకటి. ‘ఉదగమండలం’ అని పిలువబడే ఊటీ, ఏడాది పొడవునా పర్యాటకులతో నిండిపోతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ ప్రయాణం, పైకర సరస్సు, జలపాతాలు ప్రధాన ఆకర్షణలు. మెట్టుపాల్యం నుంచి ఊటీకి ఆవిరితో నడిచే టాయ్ ట్రైన్‌లో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
4. అలెప్పీ
సెలవుల్లో ఒత్తిడిని మర్చిపోయి ప్రశాంతంగా గడపాలనుకుంటే అల్లెప్పీ ఉత్తమ ఎంపిక. ఇది ‘అలప్పుజ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. అల్లెప్పీ బ్యాక్ వాటర్ టూరిజానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ కాలువలు, మడుగులు, సరస్సులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తాయి. హౌస్ బోట్స్‌లో ఓ రాత్రి గడపడం ఒక అపూర్వమైన అనుభవం.
5. మున్నార్
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్, సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి పచ్చటి కొండలు, పొగమంచుతో కప్పబడి ఉండే లోయలు, తేయాకు తోటలు, ఉప్పొంగే జలపాతాలు, స్వచ్ఛమైన గాలి మిమ్మల్ని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకువెళ్తాయి. ప్రకృతి ప్రేమికులకూ, హనీమూన్ కపుల్స్‌కి బెస్ట్ ప్లేస్.
6. పుదుచ్చేరి
తమిళనాడు సమీపంలోని పాండిచ్చేరి చిన్న పట్టణం అయినప్పటికీ, భారతదేశపు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ఫ్రెంచ్ కాలనీలతో ప్రసిద్ధి. అందమైన బీచ్‌లు, ఆశ్రమాలు, మ్యూజియంలు, విలాసవంతమైన రిసార్ట్‌లు, చిక్ క్లబ్‌లు మీకు ఒక యూరోపియన్ అనుభూతిని అందిస్తాయి. రాత్రి వేళ వీధుల్లో విహరించడం పుదుచ్చేరి స్పెషల్!

7. గోవా
గోవా అంటే బీచ్‌లు, పార్టీలు, అడ్వెంచర్ స్పోర్ట్స్! ఇది భారతదేశంలోని అత్యంత చిన్న రాష్ట్రమైనప్పటికీ, టూరిజంలో అగ్రగామిగా ఉంది. ఇక్కడ బీచ్‌లు, నదులు, అడవులు, చర్చిలు, వన్యప్రాణి అభయారణ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ స్విమ్మింగ్, విండ్సర్ఫింగ్, స్కూబా డైవింగ్, సన్ బాతింగ్ లాంటి అనేక వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించవచ్చు.