• Home
  • Entertainment
  • వెంకీ అట్లూరి-అజిత్ కాంబినేషన్‌లో కొత్త మూవీ… ఫ్యాన్స్ ఖుషీ!
Image

వెంకీ అట్లూరి-అజిత్ కాంబినేషన్‌లో కొత్త మూవీ… ఫ్యాన్స్ ఖుషీ!

టాలీవుడ్‌లో తనదైన శైలిలో విజయవంతంగా దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పుడు తమిళ స్టార్ అజిత్‌తో కలిసి సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘సార్ (వాతి)’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న వెంకీ, ఇప్పుడు కోలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇతీవల అజిత్ నటించిన ‘విడాముయార్చి’ (ఫిబ్రవరి 6, 2025 విడుదల) సినిమాతో పాటు, ఏప్రిల్ 10న విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు వరుస విజయాలతో బాక్సాఫీస్‌ దుమ్ము రేపాయి. రెండు సినిమాల్లోనూ త్రిష హీరోయిన్‌గా అలరించింది. ముఖ్యంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఐదు రోజుల్లోనే ₹100 కోట్ల మార్క్‌ దాటింది.

ఇలాంటి విజయాల అనంతరం అజిత్ తదుపరి సినిమా కోసం అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి కొత్త ప్రాజెక్ట్‌లో నటించనున్నారని టాక్. వెంకీ అట్లూరి గతంలో ‘సార్’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ‘లక్కీ భాస్కర్’ తో దుల్కర్ సల్మాన్‌కు భారీ హిట్ అందించి, తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నారు.

ఇప్పుడు వెంకీ అట్లూరి – అజిత్ కాంబినేషన్‌ రాబోతుందన్న వార్త అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్‌ తీసుకొచ్చింది. ఈ క్రేజీ కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply