సోషల్ మీడియాలో హీరోయిన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాల అప్డేట్స్ తో పాటు తమ పర్సనల్ లైఫ్ నుండి ఫన్నీ, క్రియేటివ్ కంటెంట్ కూడా పంచుకుంటూ ఉంటారు. కొంతమంది విహారయాత్రలకు వెళ్లి అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా నటి వర్ష బొల్లమ్మ చేసిన ఓ ఫన్నీ పని నెట్టింట వైరల్ అవుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వర్ష బొల్లమ్మ, తమిళ సినిమా “96”లో విద్యార్థినిగా, “విజిల్”లో ఫుట్ బాల్ ప్లేయర్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో “మిడిల్ క్లాస్ మెలోడీస్” చిత్రంతో హీరోయిన్‌గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఆమె, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
తాజాగా వర్ష బొల్లమ్మ విహారయాత్రలో భాగంగా ఓ ఫౌంటెన్ వద్ద చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఓ సింహం ఆకారంలో ఉన్న ఫౌంటెన్ వద్ద నిలబడి, ఆ ఫౌంటెన్ నుంచి వస్తున్న నీటిని తలపై వేసుకుంటూ తలస్నానం చేసినట్లు ఫన్నీగా నటించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన నెటిజన్స్ “సింహం ముందు కోతిపనులు!”, “ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ ఏంటి తల్లి?”, “అమ్మాయో నువ్వు అంతేంటో!” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వర్ష బొల్లమ్మ తన హాస్యభరిత ప్రవర్తనతో అభిమానులను నవ్వుల పండుగలో ముంచెత్తుతోంది.