కన్నడ స్టార్ హీరో ఉಪేంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “UI”. గతంలో వరుస విజయాలతో అలరించిన ఆయన, ఈసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2023 డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందింది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆయన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి మంచి ప్రశంసలు దక్కాయి. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, రూ. 47 కోట్లే రాబట్టింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ & టీవీలో విడుదలకు సిద్ధమవుతోంది.

UI” మూవీ ఓటీటీ & టీవీ రిలీజ్ డీటైల్స్:
ఈ సినిమా ఓటీటీ హక్కులు జీ నెట్‌వర్క్, టీవీ హక్కులు జీ కన్నడ దక్కించుకున్నట్లు సమాచారం. ఉగాది పండగ సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4:30 గంటలకు జీ కన్నడలో ప్రీమియర్ కానుంది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక సమాచారం లేదు.
కథ సారాంశం:
“UI” సినిమాను చూసిన ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీ శర్మ) సైతం రివ్యూ రాయలేక ఇబ్బందిపడతాడు. కథకు సంబంధించిన అసలు విషయం తెలుసుకోవడానికి ఉపేంద్ర ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ స్టోరీలో “సత్య” (ఉపేంద్ర), “కల్కి భగవాన్” ఎవరు? తెలుసుకోవాలంటే “UI” చూడాల్సిందే.