మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తరచుగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అభిమానులతో కాంటాక్ట్‌లో ఉంటారు. అంతేకాదు, రామ్ చరణ్ సినిమాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

తాజాగా, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉపాసన ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశారు. వాలెంటైన్స్ డే అంటే కేవలం కొందరికే అనేది ఆమె చెప్పిన అభిప్రాయం నెట్టింట వైరల్‌గా మారింది. “వాలెంటైన్స్ డే అనేది 22 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల కోసమే. మీ వయసు అంతకంటే ఎక్కువ అయితే, దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం ఎదురుచూడండి” అంటూ ఆమె పోస్ట్ చేశారు. దీనికి హాస్యాస్పదమైన ఎమోజీలను జోడించడంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, సంక్రాంతి సందర్భంగా “గేమ్ ఛేంజర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కియారా అద్వానీ, అంజలి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సరనతో ఓ కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.
