టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస విజయాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.

త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తన సత్తా చాటుతూ, తెలుగు, తమిళం ప్రేక్షకుల మనసు దోచుకుంటూ వస్తోంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, ఇప్పుడు వరుస సినిమాలతో మళ్లీ క్రేజ్‌ను పెంచుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు సినిమాలతో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” చిత్రంలోనూ త్రిష కీలక పాత్రలో నటిస్తోంది.
త్రిష సినీ ప్రస్థానానికి పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలోనే స్టార్ హీరోలతో త్రిష ప్రేమాయణంపై రూమర్లు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో ఆమె పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపించగా, త్రిష తల్లి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. అంతేకాకుండా, త్రిష త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష, విజయ్ దళపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “షూటింగ్ సెట్‌లో హీరో శింబు నన్ను తరచూ టీజ్ చేస్తాడు. కానీ విజయ్ మాత్రం ఒక గోడ పక్కన మౌనంగా కూర్చుంటాడు” అంటూ చెప్పుకొచ్చింది. విజయ్ దళపతిలో తనకు నచ్చని విషయం ఇదేనని, ఆయన కొంతమేరకు మారాలని సూచించింది. అంతేకాకుండా, విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని కూడా పేర్కొంది.
త్రిష చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చలు సాగిస్తున్నారు. మరి త్రిష, విజయ్ మధ్య ఉన్న నిజమైన సంబంధం ఏంటన్నదీ.. త్రిష రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందన్నదీ వేచి చూడాల్సిందే!