వచ్చే సంక్రాంతి పండగకి తెలుగు సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలు ఐంది. ప్రతి సారి లాగే ఈ సారి కూడ అరడజను సినిమాలు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ వాయిదా పడటంతో రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ సంక్రాంతి రేస్ లోకి వచ్చింది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా గేమ్ చెంజర్ మూవీ జనవరి 10, 2025న రానుంది. అప్పుడెప్పుడో కరోన కంటే ముందు మొదలు అయిన ఈ సినిమా ఎట్టకేలకి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ సినిమాను దిల్ రాజు బడ్జెట్ లిమిట్ లేకుండా ఖర్చు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడ సంక్రాంతి కి రానుంది. Nbk109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.
విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతి కి వస్తున్నాం అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా వస్తుంది. ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ ఈ వస్తున్నా ఈ చిత్రం సంక్రాంతి పండగకి వస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ స్టార్ హీరో అజిత్ తో గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా నిర్మిస్తున్నారు. తమిళ మరియు తెలుగు భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అధిక్ రవి చంద్రన్ దర్శకత్వం వచిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తండేల్ మూవీ కూడ సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాను బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో వస్తున్నా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సంక్రాంతి పండగ దిల్ రాజు పండగ లాగ ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు సినిమాలు, బాలకృష్ణ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు దగ్గరే ఉండే అవకాశం ఉంది. దింతో ఈ సారి మూడు సినిమాలతో వస్తున్నారు. దింతో దిల్ రాజు పంట పండినట్టే అనుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ వారి నుంచి థియేటర్ల సమస్య రావచ్చు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడ రాబోతున్నాయి.
మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినిమా ప్రేక్షకులకు విందు భోజనంలాగ ఉండే అవకాశం ఉంది.