తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన

👉 అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా లేదా ఐవీఆర్ నంబర్ 9240205555 డయల్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
👉 ఈసారి అమ్మాయిలే మెరిశారు. టాప్ ర్యాంకులు సాధించినవారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు.
👉 మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
👉 ఫస్ట్ ఇయర్‌కు 4.88 లక్షల మంది, సెకండ్ ఇయర్‌కు 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
👉 ఈసారి గ్రేడ్‌లు కాకుండా మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.
తక్కువ మార్కులు వచ్చిన వారు లేదా ఫెయిలైన వారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే రీ వాల్యుయేషన్/రీ కౌంటింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీలను ఇంటర్ బోర్డు త్వరలో వెల్లడిస్తుంది.