పల్నాడు జిల్లా కారంపూడిలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి అమర్ ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీపురానికి చెందిన హనుమంతరావు, లక్ష్మీ దంపతుల కుమారుడు అమర్ (15) ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో చదువుకుంటున్నాడు. విద్యార్థికి చదువు పై ఒత్తిడి ఎక్కువై, ఆత్మహత్యకు దారితీసింది.

సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన అమర్, తిరిగి స్కూల్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సోమవారం స్కూల్‌కి వెళ్ళమని తండ్రి చెప్పినా, అమర్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు పొలం నుంచి ఇంటికి చేరినప్పుడు అమర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు.
అమర్ స్కూల్ స్నేహితులకు చదువుకోవడం ఇష్టంలేదని చెప్పినట్టు పోలీసులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.