వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ సంక్రాంతి పండగ సమరంలో ముందుగా రానుంది. ఆ తరువాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా రానుంది. ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడ రానుంది. ఈ సినిమాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ తో చేసిన గూడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా కూడ రానుంది. అదే విధంగా మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీంతో ఈ సంక్రాంతికి రావలసిన విశ్వంభర సమ్మర్ కి వాయిదా పడింది. ఇప్పుడు పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోల చూపు సమ్మర్ పై పడింది. అయితే ఈ సమ్మర్ లో వచ్చే సినిమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం….
రాజాసాబ్ :
కల్కి సూపర్ హిట్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్చి సినిమా తరువాత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నాము అని ప్రకటించారు.
టాక్సిక్ :
రాకి భాయి యాష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టాక్సిక్. గీతు మోహనదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజిఫ్ 2 తరువాత వస్తున్న చిత్రం కావాదంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల అవుతునది. అయితే ప్రభాస్ రాజా సాబ్ నుంచి విపరీతమైన పోటీ రావొచ్చు.
విశ్వంభర :
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మొదట సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో సమ్మర్ కి వాయిదా వేశారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోసియో ఫాంటసి నేపద్యంలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని మే మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
OG / హరి హర వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాల సినిమాలు ఉన్నాయి కానీ టైమ్ లేదు. ఒక వైపు ప్రజాజీవితంలో అలుపెరుగని సేవ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, మరో వైపు దొరికిన తక్కువ టైమ్ లో షూటింగ్ లకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు og షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లేని సన్నీవేషాలు షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రయంలు కూడ శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే og సినిమా వచ్చే సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది.
మాస్ జాతర :
మాస్ రాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సమ్మర్ కి రావడానికి సిద్దం అయింది. మే 9 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హిట్ : కేసు నెంబర్ 3
హిట్ సినిమా ఫ్రాంచైజిలో బాగంగా మొదటి రెండు పార్టులు సూపర్ హిట్ అవ్వడంతో కేసు నెంబర్ 3 పై అంచనాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు పార్ట్ లో విశ్వక్ సేన్, అడవి శేష్ నటించారు. మూడో పార్ట్ లో నాని నటిస్తుండటంతొ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ 2 లో క్లైమాక్స్ లో చిన్న క్లూ ఇవ్వడంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మీరాయి :
హనుమాన్ సినిమాతో కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో తేజ సజ్జా తన తరువాతి చిత్రాన్ని కూడ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో విలన్ రోల్ లో మంచు మనోజ్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడ వచ్చే ఛాన్స్ ఉంది. గత ఏడాది సమ్మర్ లో ఎలెక్షన్ వల్ల ఆ సీజన్ మొత్తం సినిమాలు లేక థియేటర్లు మూసివేశారు. కానీ ఈ సారి మాత్రం పెద్ద సినిమాలు వస్తుండటంతో అభిమానులు కూడ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.