హైదరాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. శుక్రవారం తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ నేరడిగొండలో 41°C నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నేడు వడగాలుల తీవ్రత మరింత పెరగనుంది.

తెలంగాణలో ఎండల తీవ్రత:
నిన్న నిజామాబాద్, ఆదిలాబాద్ 40.8°C, భద్రాచలం, మహబూబ్‌నగర్ 39°C, ఖమ్మం 38.8°C, హైదరాబాద్ 38.2°C, హనుమకొండ, నల్లగొండ 37°C చొప్పున నమోదయ్యాయి.
ఏపీలో ఎండ ప్రభావం:
ఏపీలో శనివారం 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచే అవకాశముంది. ప్రకాశం జిల్లా తాటిచెర్ల, వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42.6°C నమోదైంది. నంద్యాల, తిరుపతి, అనంతపురం, విజయనగరం, నెల్లూరులో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణ శాఖ ప్రకారం, రేపు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.












