తెలుగు సినిమా పరిశ్రమలో ఐటీ దాడుల హడావిడి కొనసాగుతోంది.
నాలుగో రోజు కూడా ప్రముఖ నిర్మాతల ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసులు, ఇళ్లు ఐటీ అధికారుల తనిఖీలకు గురయ్యాయి.
దిల్ రాజు ఇంటి వద్ద ఐటీ అధికారుల తనిఖీలు:
- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసు, దిల్ రాజు ఇంట్లో తనిఖీలు.
- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బడ్జెట్ చిత్రాల పెట్టుబడులపై ఆరా.
- బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు పరిశీలించారు.

మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా పై తనిఖీలు:
మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కూడా ఐటీ తనిఖీలు కొనసాగాయి. ప్రముఖ చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంటిలోనూ తనిఖీలు నిర్వహించారు.
సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రాల రాబడులపై ఫోకస్:
ఈ సంక్రాంతికి విడుదలైన “గేమ్ ఛేంజర్,” “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాల రాబడులపై ప్రత్యేక పరిశీలన. ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి, వీటిలో వెంకటేష్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
సినీ పరిశ్రమలో ఆర్ధిక లావాదేవీలు:
ఇప్పటి వరకు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, సినిమాల పెట్టుబడులు, లావాదేవీలపై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు. నాలుగో రోజు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి.












