తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ కి చేరాయి నిన్న BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. KTR మాత్రం అమృత్ స్కీమ్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి సవివరంగా వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టపెట్టారు అని.. తెలంగాణ రాష్ట్రానికి అమృత్ 2.ఓ లో బాగంగా కేటాయించిన 8 వేల 888కోట్ల పనులపై విచారణ జరిపించాలని కోరారు. అదే విధంగా సిఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారు. Telangana Latest Politics
సిఎం రేవంత్ రెడ్డి కూడ హస్తిన బాట పట్టనున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన పిర్యాదుపై కూడ స్పందించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ భేటీలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్టలలో ఎన్నికల ప్రచారం కోసం అనుసరించాల్సిన వ్యూహలను కూడ ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రచారానికి ఇంకో వారం రోజుల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలు, అమలు అవుతున్న పథకాలు, చేపట్టబోయే పథకాలు గురించి కూడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు లతో పాటు ఆశవాహులు ఎంతగానో ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు భర్తీ ఈ విధంగా అన్నీ విషయాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
హస్తినలో రెండు పార్టీల అగ్రనేతలు ఉండటంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు కేటిఆర్ ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అమృత్ స్కామ్ గురించి నేషనల్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై కూడ పెదవి విప్పే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు ఢిల్లీలో ఏమి జరుగుతుందో చూడాలి.