తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన ప్రక్రియ, సేకరించిన సమాచారం, అలాగే ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో సభ్యులకు అందజేయనున్నారు.

కులగణన నివేదికను అసెంబ్లీలో విడుదల చేసిన అనంతరం, దాని ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు అందించనుంది. ఈ నివేదికను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో కమిషన్ తన తుది సిఫారసులను రూపొందించనుంది. ఇక త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు కొత్త రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేయనుంది.
తెలంగాణ కులగణన నివేదికలో ముఖ్యాంశాలు:
- బీసీలు: 1,64,09,179 మంది (46.25%)
- ఎస్సీలు: 61,84,319 మంది (17.43%)
- ఎస్టీలు: 37,05,929 మంది (10.45%)
- బీసీ మైనారిటీ ముస్లింలు: 35,76,588 మంది
- ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48%
- ముస్లిం మైనారిటీ మొత్తం జనాభా: 12.56%
ఈ కులగణన నివేదిక ఆధారంగా, తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించనుంది. బీసీల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను తుది రూపంలో సిద్ధం చేయనున్నారు.