తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. విద్యార్థులు ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్లలో చెక్ చేయవచ్చు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను పొందొచ్చు.
ఈ సంవత్సరం 9.96 లక్షల మంది విద్యార్థులు 1532 కేంద్రాల్లో మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 18 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమై, తొలిసారిగా రాండమ్ రీవాల్యుయేషన్ చేపట్టారు. ముఖ్యంగా పాస్ మార్కులకు సమీపంలో ఉన్న విద్యార్థుల పేపర్లు రెండు దశల్లో పరిశీలించి ఫలితాల ప్రక్రియ పూర్తయింది.
ఫలితాల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ఒక నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.