• Home
  • Telangana
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కఠిన వ్యాఖ్యలు – ఐఏఎస్‌లకు సీఎం రేవంత్ వార్నింగ్
Image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కఠిన వ్యాఖ్యలు – ఐఏఎస్‌లకు సీఎం రేవంత్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడిపే అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీల్డ్ విజిట్‌లు చేయాలని పదేపదే సూచించినప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఏసీ అనేది జబ్బేమో!” అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, ఇకపై కంఫర్ట్ జోన్‌లో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యంగా, ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత అధికారుల బదిలీలు భారీగా జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న, పనితీరు తక్కువగా ఉన్న అధికారులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గతంలో కలెక్టర్ల సమావేశంలో ఫీల్డ్ విజిట్‌లు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తప్ప మిగతా కలెక్టర్లు ఆదేశాలను పాటించకపోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఫీల్డ్ విజిట్‌లు చేయని కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు.

పోలీసు అధికారుల విషయంలోనూ సీఎం ఫోకస్ పెట్టారు. ఇసుక దందాలు, పేకాట నిర్వాహణ వంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్న అధికారులను తొలగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పుడు సీఎంవి వ్యాఖ్యలు అధికారులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని సంకేతాలు అందడంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. పనితీరు, ఫీల్డ్ విజిట్‌లకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కొత్త పాలనా విధానం అమలు చేయాలని సంకల్పించారు.

ఇక ఈ మార్పులు ఎంతవరకు అమలు అవుతాయో వేచి చూడాలి!

Releated Posts

“నన్నే టార్గెట్ చేస్తారా?” – స్మితా సబర్వాల్ స్పందన వైరల్

కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు…

ByByVedika TeamApr 19, 2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల – ఇంటర్ బోర్డు ప్రకటన

తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11…

ByByVedika TeamApr 19, 2025

IPL 2025 ఫిక్సింగ్ ఆరోపణలపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్‌ల అనంతరం ఢిల్లీ జట్టు…

ByByVedika TeamApr 19, 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply