తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీను కలిశారు. ఈ భేటీలో SLBC టన్నెల్ సహాయక చర్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల జాబితా మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఐదు కీలక అంశాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు.

రేవంత్ రెడ్డి వినతులు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2 కోసం రూ.22,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి.
- రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలని అభ్యర్థన.
- డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే & రైల్వే లైన్ నిర్మాణం.
- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం నిధుల మంజూరు.
- 27 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయడంతో పాటు వరద నియంత్రణ చర్యల కోసం నిధులు కేటాయించాలని కోరారు.
ప్రధాని మోదీ సూచనలు
- 2017-2022 మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు.
- ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన (గ్రామీణ) అమలు కోసం 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తిచేసి అర్హులను గుర్తించాలి.
- శంషాబాద్ ESI ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.150 కోట్లు విడుదల చేయాలని తెలిపారు.
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం మూడు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
- బీబీనగర్ AIMMSకి నీటి & విద్యుత్ సరఫరా కోసం రూ.1,365.95 కోట్లు మంజూరు చేయాలని సూచించారు.
- రైల్వే ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
- మూడు నీటి పారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచించారు.
ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.