మరత్వాడ, విదర్భ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో నిన్న (సోమవారం) నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు:
- ఆదిలాబాద్ – 41.8°C
- నిజామాబాద్ – 40.4°C
- మెదక్ – 40.2°C
- భద్రాచలం – 39.8°C
- రామగుండం – 38.8°C
- మహబూబ్ నగర్ – 38.6°C
- హైదరాబాద్ – 38.5°C
- ఖమ్మం – 38.4°C
- నల్లగొండ – 38°C
- హనుమకొండ – 37.5°C
ఏపీలో వాతావరణ పరిస్థితి:
- మంగళవారం శ్రీకాకుళం (6), విజయనగరం (6), పార్వతీపురం మన్యం (10), అల్లూరి సీతారామ రాజు (3), తూర్పుగోదావరి (1) జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది.
- బుధవారం 28 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
- గురువారం రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు:
- నంద్యాల (గోస్పాడు) – 40.3°C
- కర్నూలు (కమ్మరచేడు) – 40.2°C
- అనంతపురం (నాగసముద్రం) – 40°C
- వైఎస్సార్ (గోటూరు) – 39.9°C
- అనకాపల్లి (రావికమతం) – 39.7°C
- మన్యం (జియ్యమ్మవలస) – 39.6°C
వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2-4°C తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.