టీమిండియా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధం
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. ఇప్పటికే ఐదు రోజుల ముందే దుబాయ్‌కి చేరుకొని, ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ సేన, గెలుపే లక్ష్యంగా గ్రౌండ్‌లోకి దిగనుంది.

ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డే సిరీస్‌లో టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ ఫామ్‌లోకి రావడంతో జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తే బంగ్లాదేశ్‌పై విజయం సులభమే అనిపిస్తున్నా, ఏ ప్రత్యర్థినైనా తక్కువ అంచనా వేయకూడదనే సిద్ధాంతాన్ని టీమిండియా మరిచిపోరాదు.
టీమిండియా లోపాలు & సవాళ్లు
అయితే, టీమిండియా మెరుగైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్-కోహ్లీ జోడి పూర్తిగా ఫామ్‌లోకి వచ్చారా? లేక ఆడిన ఇన్నింగ్స్‌లు తాత్కాలిక మెరుపులా? అన్నది ఈ మ్యాచ్‌లో తేలనుంది.
ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీ టీమిండియాకు నష్టమే. పైగా సెలెక్టర్లు సిరాజ్‌ను పక్కనపెట్టడం కొంత ఆశ్చర్యకరంగా మారింది. షమీ ఉన్నా, అతను పూర్తిగా రిథమ్‌లో లేడు. యువ బౌలర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అనుభవం తక్కువ కావడంతో ప్రదర్శనపై సందేహాలు ఉన్నాయి.
మిడిల్డార్‌లో శ్రేయస్ అయ్యర్ స్థిరమైన ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ, కేఎల్ రాహుల్ ఇంకా పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. అతను ఫామ్‌లోకి వస్తే, జట్టు మధ్య ఓవర్లలో మరింత బలంగా నిలుస్తుంది.
పిచ్ రిపోర్ట్ & మ్యాచ్‌పై అంచనాలు
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెండు కొత్త పిచ్‌లు సిద్ధం చేశారు. సాధారణంగా ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో స్పిన్ బౌలర్లకు కూడా సహాయపడే అవకాశం ఉంది. టీమిండియా సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగితే, ఈ పిచ్‌ను తమ అనుకూలంగా మార్చుకోవచ్చు.
అంచనా ప్లేయింగ్ ఎలెవన్
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- శుబ్‌మన్ గిల్
- విరాట్ కోహ్లీ
- శ్రేయస్ అయ్యర్
- కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
- అక్షర్ పటేల్
- హార్ధిక్ పాండ్యా
- రవీంద్ర జడేజా
- కుల్దీప్ యాదవ్
- మొహమ్మద్ షమీ
- అర్షదీప్ సింగ్
ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో సమర్థంగా రాణించి, ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేస్తుందని ఆశిద్దాం!