వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు చాలా మంది ఇష్టపడతారు. మార్కెట్లలో, రోడ్ల పక్కన విస్తృతంగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి వేడిని తగ్గించడంతో పాటు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ముంజల్లో జింక్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
తాటి ముంజలు పామ్ ఫ్రూట్ లేదా ఐస్ యాపిల్స్ అనే పేర్లతో కూడా ప్రసిద్ధం. వీటిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఇవి మేలు చేస్తాయి. తాటి ముంజలు తినడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తాటి ముంజల్లో ఫైటోకెమికల్స్గా ప్రసిద్ధి చెందిన ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి వివిధ రకాల కణితులు, రొమ్ము క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలు ఈ ముంజలను తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి తాటి ముంజలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. రక్తహీనతను తగ్గించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవిలో వచ్చే చర్మ సమస్యలు, అలర్జీలను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

మలబద్ధకం, విరేచనాల సమస్యలు ఉన్నవారికి తాటి ముంజలు మంచివి. పేగు సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. నాలుకపై వచ్చే అల్సర్లను తగ్గించగల శక్తి వీటిలో ఉంది. వేసవిలో అధికంగా వచ్చే మొటిమలు, చర్మ సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. తాటి ముంజల రసాన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చెమట బొబ్బలు త్వరగా తగ్గుతాయి.
ముంజలు పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శిశువులకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. మహిళల్లో తెల్లబట్ట సమస్యను తగ్గించడంలో కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి.
గమనిక:
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.