మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ థియేటర్లలోకి వచ్చేసింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు అదనపు హైలైట్. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ఈ చిత్రం ‘తండేల్’ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ బజ్ క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
ఫిల్మ్ విడుదలై ప్రీమియర్ షోలను చూసిన అడియన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అన్నారు. నాగచైతన్య పాత్రను చూసి అతి గొప్పంగా నటించారని ప్రేక్షకులు వర్ణించారు.