Vedika Media

Vedika Media

vedika logo

2024 లొ విజ‌యం సాధించిన తెలుగు సినిమాలు

2024 తెలుగు చిత్ర పరిశ్రమకు బాగానే కలిసొచ్చింది. జనవరిలో ‘హనుమాన్’ సినిమాతో మొదలు పెడితే.. డిసెంబర్ లో పుష్ప 2తో కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తంగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ విషయానికొస్తే..

హనుమాన్.. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి హేమాహేమీలకు చుక్కులు చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

టిల్లు స్క్వేర్ .. సిద్దు జొన్నలగడ్డ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గా రూ. 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2024లో హ్యూజు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కమిటీ కుర్రోళ్లు.. నిహారిక కొణిదెల సమర్పణలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా 2024లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆయ్’ . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మత్తు వదలరా.. 2.. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా ..2’. ఈ సినిమా 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

దేవర పార్ట్ 1.. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు జూనియర్) కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూల్లతో దుమ్ము దులిపింది. ఈ చిత్రం 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

క.. కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ – సందీప్ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం ‘క’. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలైన సంచలన విజయం సాధించింది

లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ వసూల్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పుష్ప 2 ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైన భారతీయ బాక్సాఫీస్ దగ్గర 2024లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ, కన్నడ, ఓవర్సీస్ లో మంచి విజయం సాధించింది. ఎక్కువ రేటుకు అమ్మడంతో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏరియాలో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Vedika Media