Vedika Media

Vedika Media

vedika logo

కాంబ్లీ ఆరోగ్యం విషమం

క్రికెట్ ప్రపంచానికి ఒకప్పుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి మెరిసిన‌ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో ఆయన థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్‌తో కలిసి రమాకాంత్ ఆచ్రేకర్ గారి శిష్యుడిగా క్రికెట్‌లో అడుగుపెట్టి, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌ నుండి దూరం అయ్యాడు.

కొద్ది రోజుల క్రితం రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్‌తో కలిసి వీల్‌చైర్‌లో కనిపించిన కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి చూసి అందరూ ఆందోళన చెందారు. ఆయన అతి కష్టంగానే నడుస్తూ, మాట్లాడతూ కనిపించారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి విషయంలో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. అతని సహచరులు, అభిమానులు కాంబ్లీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా కాంబ్లీకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వినోద్ కాంబ్లీ 1991లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 1993లో టెస్టు క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. కొంతకాలం అద్భుతమైన ఆటను ప్రదర్శించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌ నుండి దూరం అయ్యాడు.

IND vs AUS: చ‌రిత్ర సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా

IND vs AUS 3వ టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన టెస్ట్ కెరీర్‌లో 22వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో జడేజా ఈ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ (77 పరుగులు) ఆడాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత, జడేజా బ్యాటింగ్‌కు దిగి, రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవైపు రాహుల్ 86 పరుగులు చేసి ఔట్ అయినా జడేజా క్రీజులో ఆడుతూ … Read more

Vedika Media