Vedika Media

Vedika Media

vedika logo

నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత భవితవ్యం కోసం విశేషంగా కృషి చేస్తుంది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించేందుకు ‘ట్రెయిన్‌ అండ్‌ హైర్‌’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థలే యువతకు శిక్షణ ఇచ్చి, ఆయా సంస్థల్లో, అనుబంధ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తాయి. శిక్షణ పూర్తిగా ఉచితంగానే అందిస్తాయి. అభ్యర్థుల నుంచి ఎటువంటి రుసుమూ వసూలు చేయరు.

దీనిలో భాగంగా యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఆయా సంస్థలకు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో కొంత స్థలం కేటాయించడం, వారికి అవసరమైన అర్హతలు కలిగిన యువతను అందించడంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకరిస్తుంది. ఇక ఇప్పటికే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్థలం సేకరించారు. ఇదే మాదిరి మిగతా యూనివర్సిటీలతోనూ సంప్రదింపులు జరిపి, స్థలాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో టెక్‌ వర్క్స్‌ సంస్థ 30 మందికి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు విజయవాడ ఐటీఐ క్యాంపస్‌లో కూడా రెవిలేషనరీ సంస్థ 30 మందికి శిక్షణ ఇస్తోంది. సంస్థలు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ ఏపీ సర్కార్‌ శిక్షణకు స్థలం కేటాయిస్తుంది.

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి పునఃనిర్మాణంపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పునఃనిర్మాణానికి మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళికతో పనులను స్పీడప్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో అమరావతి పునఃనిర్మాణానికి సంబంధించిన సీఆర్డీఏ అథారిటీ 43వ సమావేశంలో ఆమోదించిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన ఆమోదం తీసుకోబడుతుంది. ఇందులో ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, ఐకానిక్ … Read more

Vedika Media