ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాడ్ ఫామ్ కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 7 మ్యాచ్‌లలో 5వ ఓటమి, ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌కు అవకాశాలు గణనీయంగా తగ్గాయి. మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 5 గెలవాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ దారుణంగా పతనమైంది. మొత్తం 162 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ (40), క్లాసెన్ (37) కొంత మంచి ప్రదర్శన చూపించినప్పటికీ, ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.

ఈ సమయంలో, ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, నితీష్ కుమార్ రెడ్డి చేసిన “ప్రిపేరింగ్ ఫర్ 300” అనే ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సరదాగా ట్రోల్ చేశారు. “162 ఇప్పుడు కొట్టారు, ఏప్రిల్ 23న ముంబైతో 138 కొడితే 300 అవుతుంది” అని ట్రోల్ చేశారు.

ఈ మ్యాచ్‌లో దారుణమైన ప్రతికూలతను ఎదుర్కొన్న సన్‌రైజర్స్, ఇప్పుడు 23న మళ్లీ హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో ముంబైతో మ్యాచులో ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.