• Home
  • International
  • సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడానికి ఖర్చు ఎంతో తెలుసా?
Image

సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడానికి ఖర్చు ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్ (ISS) కి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లారు. అయితే, సాంకేతిక లోపాల కారణంగా స్టార్‌లైనర్ వారు లేకుండానే సెప్టెంబర్‌లో భూమికి తిరిగి వచ్చింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు ISS‌లోనే చిక్కుకుపోయారు.

వారిని భూమికి తీసుకురావడానికి నాసా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఈ బాధ్యత అప్పగించారు.

దీంతో స్పేస్‌ఎక్స్, నాసా కలిసి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీతా విలియమ్స్, విల్మోర్‌ను రికవరీ చేసేందుకు మిషన్ చేపట్టారు. ISS కు చేరుకున్న డ్రాగన్ క్యాప్సూల్, ఇద్దరు వ్యోమగాములను తీసుకొని 2025 మార్చి 19న అమెరికా ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. వీరు సురక్షితంగా భూమిపైకి వచ్చారని నాసా అధికారికంగా ప్రకటించింది.

ఈ మిషన్ కోసం అమెరికా భారీగా ఖర్చు చేసింది. వ్యోమగాములను భూమికి రప్పించేందుకు మొత్తం $140 మిలియన్ (దాదాపు ₹1,200 కోట్లు) ఖర్చయింది. ఈ భారీ ఖర్చుకు ప్రధాన కారణం క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలు. ISS నుంచి భూమికి తిరిగి రావడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్సూల్, అధిక బరువు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు, మానవ భద్రతా వ్యవస్థలు కలిగి ఉంది.

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీనిని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఒక్కో ప్రయోగానికి సుమారు $69.75 మిలియన్ ఖర్చు అవుతుంది.

Releated Posts

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి.. రాజకీయ దుమారం!

హైదరాబాద్‌ ఇప్పుడు ప్రపంచ సుందరీమణులతో సందడిగా మారింది. మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి కాగా, పోటీదారులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. మిస్…

ByByVedika TeamMay 7, 2025

తెలంగాణలో మిస్ వరల్డ్-2025 పోటీలు: చార్మినార్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు ప్రారంభం..

హైదరాబాద్ పాతబస్తీలో మే 31 నుంచి మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికగా చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్) ఎంపికైంది.…

ByByVedika TeamMay 6, 2025

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు: 120 దేశాల అందగత్తెల రాక, ఏర్పాట్లపై Telangana Tourism బిజీ…!!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఇది 72వ…

ByByVedika TeamMay 5, 2025

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 – 120 దేశాల యువతుల హాజరు…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7 నుంచి 31 వరకు…

ByByVedika TeamMay 2, 2025

Leave a Reply