Vedika Media

Vedika Media

vedika logo

ఎటు తేల్చుకోలేకపోతున్నకావ్య పాప… కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..

గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆర్చర్య పరిచిన srh ఈ సారి కూడ అదే ఊపుతో టైటిల్ కొట్టాలని అనుకుంటుంది. అయితే ఈ సారి జరగనున్న మెగా వేలంలో ప్లేయర్స్ ని చాల జాగ్రత్తగా ఎంపిక చేయాలనీ అనుకుంటుంది. దీనికి తగ్గట్టు జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

వేలానికి ముందు అన్ని జట్లు తమ ఉంచుకులే ఆటగాళ్ల పేర్లను తప్పనిసరిగా వెల్లడించాలి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) నుంచి కీలక వార్త వెల్లడైంది. గత సీజన్ లో రెండో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడు కోసం  రూ. 23 కోట్లు  భారీ మొత్తాన్ని పెట్టేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం….  

 

కావ్య మారన్ యాజమాన్యంలోని ఫ్రాంఎటు తేల్చుకోలేకపోతున్నకావ్య పాప… కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.. చైజీ ఈ నా 3 కోట్ల మొత్తాన్ని కెప్టెన్ పాట్ కమిన్స్ లేదా స్టార్  బ్యాటర్  ట్రావిస్ హెడ్‌కి చెల్లించాలని భావిస్తున్నారు. అయితే, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అత్యధిక మొత్తానికి పొందే అవకాశం ఉందని మరికొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే గత సీజన్ లో హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. హైదరాబాద్‌కు కెప్టెన్‌గా కూడ ఉండి జట్టును ఫైనల్ వరకు తీసుకోని వెళ్లారు. కానీ బౌలర్ గా మాత్రం నిరాశపరిచాడు అని చెప్పాలి. 

 

అయితే అత్యధిక మొత్తం చెల్లించి అతడిని అట్టిపెట్టుకోవడానికి SRH ఇంటరెస్ట్ గా  లేదని సమాచారం. గత సీజన్‌లో అనూహ్యంగా 171 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేసిన క్లాసేన్ ను మొదటి రిటైనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది.  

 

ఈసారి కమిన్స్‌కు దాదాపు రూ.2.5 లక్షలు తగ్గనుంది. 18 కోట్ల రూపాయలకు ఫ్రాంచైజీ తమ రెండో రిటైనర్ గా ఎంపిక చేసి ఈ సారి కూడ కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.  అదే సమయంలో, గత సీజన్‌లో ఓపెనర్ గా వచ్చి చెలరేగి ఆడి అందరినీ ఆశ్చర్యపరిచిన భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను మూడో స్థానంలో కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన 14 కోట్ల  రూపాయలు అందుకోనున్నారు అని సమాచారం.  

 

అభిషేక్ శర్మ 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేయడంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో ముందున్నాడు. ఎందుకంటే నితీష్ ఇటివల ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు T20I లలో భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో 11 మ్యాచ్‌లలో 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. ఆల్ రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ ప్లేయర్ ను కూడ కొనసాగించే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు స్టార్ ఓపెనర్ ఐన ట్రావిస్ హెడ్ ను కూడ రిటైన్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Leave a Comment

Vedika Media