ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం. పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, ఏకంగా 1800 కోట్ల రూపాయల వసూళ్లతో బాహుబలి 2 రికార్డులను అధిగమించారు. జనవరి 11న సుకుమార్ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన ప్రస్థానంలో ఆసక్తికరమైన విషయాలు
సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాతో రైటింగ్ విభాగంలో తన ప్రయాణం ప్రారంభించారు. 2004లో ఆర్య సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సుకుమార్, ఆ తర్వాత జగడం, 100% లవ్, నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించారు. కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష
వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేసి, ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.