SSMB29 టైటిల్ మిస్టరీ.. గరుడా? మహారాజా? లేక జనరేషన్..?
మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఒక టెన్షన్.. ప్రారంభమైన తర్వాత మరొక టెన్షన్..! కానీ టెన్షన్ మాత్రం కామన్. తాజాగా, ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారనే విషయమై ఫ్యాన్స్‌లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

ఇటీవలే మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో, ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగనుంది. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్ సహా పలు ఎక్జోటిక్ లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేశారు. టాకీ పార్ట్‌ను ఏడాదిలోపే పూర్తి చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదివరకు, SSMB29కి “గరుడ” అనే పేరు వినిపించింది. తర్వాత “మహారాజ్” అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం మహేష్ బాబు పేరు నుంచి “MAH”, రాజమౌళి పేరు నుంచి “RAJ” కలిపి “MAHRAJ” అనే టైటిల్ క్రియేట్ చేయడం. అయితే, తాజా అప్డేట్ ప్రకారం “జనరేషన్” అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ప్యాన్ వరల్డ్ రేంజ్ మూవీ కాబట్టి, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే టైటిల్ కోసం రాజమౌళి టీం వేట కొనసాగిస్తుందట.
మరి, చివరికి ఏ టైటిల్‌కు ఓటేస్తారో చూడాలి..!