ఒక్కోసారి అతిజాగ్రత్త కూడా మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న SSMB29 విషయంలో ఇదే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జక్కన్న అత్యంత జాగ్రత్తగా సినిమాను ముందుకు తీసుకెళ్తుండగా, లీకులు మాత్రం ఆగడంలేదు.
సాధారణంగా రాజమౌళి తన సినిమాల విషయంలో ఎప్పుడూ ఎక్కువ జాగ్రత్త వహిస్తారు. కానీ SSMB29 విషయంలో మరీ ఎక్కువ రక్షణ చర్యలు తీసుకోవడంతో లీకుల సమస్య ఎక్కువవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా సినిమా షూటింగ్ వీడియో లీక్ కావడంతో టీమ్ షాక్‌కు గురైంది.

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ ఒరిస్సాలో జరుగుతోంది. అక్కడి అటవీ ప్రాంతంలో 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. మహేష్ బాబు సహా మరికొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ సెట్ నుంచే 13 సెకన్ల వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాదు, కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో వేసిన సెట్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.
ఇప్పుడు, టీమ్ కాశీ సెట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సెట్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడి ఫోటోలు కూడా లీక్ కావడంతో మేకర్స్ మరింత జాగ్రత్త పడుతున్నారు.

సాధారణంగా రాజమౌళి సినిమాల ప్రచారంలో భాగంగా కొంత సమాచారం ముందుగానే బయటికి వస్తుంది. కానీ ఈసారి మాత్రం అతిగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక అధికారిక ఫోటో కూడా విడుదల చేయలేదు. ఫలితంగా ఏదైనా లీక్ అయితే, ఫ్యాన్స్ అది వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు టీమ్ లీకులపై మరింత సీరియస్‌గా ఉండటంతో, ఈ సమస్యకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.