మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తానని చెప్పి, రేప్ కేసులో ఫస్కున్న డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా పై 28 ఏళ్ల ఒక అమ్మాయి ఇటీవల అత్యాచారం, గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేయడం, మరియు మోసం చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోరగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.

సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చి, ముంబైలో సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో, ఆమెను వివాహం చేసుకుంటానని మాటలు చెప్పి మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఆరోపణల ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం చేయించడం, బెదిరింపులు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు వైద్య ఆధారాలు కూడా సేకరించారు. కానీ, ఆ తర్వాతి రోజు, సనోజ్ పై లైంగిక దాడి జరగలేదని బాధితురాలు ఒక వీడియో విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం, ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ, ఎప్పుడూ లైంగిక దాడికి పాల్పడలేదని పేర్కొంది.
ఇంతలో, ఈ కేసులో నెటిజన్లు మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్నారు. సినిమా అవకాశాలు వాగ్దానం చేసి, చివరికి ఆమెను వదిలేసిన పరిస్థితి పై అనేక వ్యాఖ్యలు వచ్చాయి.