Vedika Media

Vedika Media

vedika logo

సోషల్ మీడియాపై ఆంక్షలు…. ఇలా అయితే దాదాపు అన్ని చానెల్స్, అకౌంట్స్ క్లోజ్…

ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ప్రధాన మంత్రి నుంచి మొదలు కొని సీఎం లు, చిన్న గల్లీ లీడర్లు మరియు సామాన్య ప్రజలు సోషల్ మీడియా భారిన పడుతున్నారు. మన దేశంలో నిత్యం అనేక మందిపై ఎదో ఒక విషయంలో ట్రోల్స్ జరుగుతున్నాయి. విమర్శయించడం తప్పు కాదు కానీ వ్యక్తిగత విషయాలను సైతం బయటికి లాగి ట్రోల్స్ చేస్తూన్నారు. అయితే రాబోయే రోజుల్లో సోషల్ మీడియాను కొంచెం కట్టడి చేసే విధంగా కొన్ని గైడ్ లైన్స్ తో కూడిన చట్టం తీసుకోని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తెచ్చేందుకు సిద్ధం అయినట్టు పొలిటికల్ అనలిస్ట్ ల నుంచి పుకార్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ బిల్లు వల్ల లాభం ఉందా? నష్టంఉందా ? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

 

నేటి కాలంలో స్కూల్ కి వెళ్లే వారి దగ్గర నుంచి 70 సంవత్సరాల వయసు వారి వరకు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. మార్నింగ్ నిద్ర లేవగానే మొదట చేసే పని సోషల్ మీడియా చూడటం. రెగ్యులర్ ఆక్టివిటీస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. సోషల్ మీడియా ను మంచిగా వాడితే చాల మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ సోషల్ మీడియాను చేడుగా వాడటం మొదలు పెడితే చాల అనర్దాలకి దారి తీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాను మంచి కంటే చెడు కోసమే ఎక్కువగా వాడుతున్నారు. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. 

 

ఇంటర్నెట్ చవకగా దొరకడం వల్ల 2016 నుంచి సోషల్ మీడియాలో నెగిటివ్ ఆక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి. ఎంతలా అంటే ఒక ప్రధాన మంత్రిని, సీఎంను, సినిమా సెలబ్రిటీని కూడ మార్పింగ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. మన వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా నుంచి సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. 

 

మన దేశంలో దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ వారిని మార్పింగ్ చేసి మరి ట్రోల్స్ చేస్తున్నారు. మంచి కంటే చేడు జనాల్లోకి తొందరగా వెళ్తుంది. అందువల్ల పొలిటీకల్ పార్టీలు తమ ఆధిపత్యం కోసం నెగిటివిటిని బాగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వారు ఎన్ని గైడ్ లైన్స్ పెట్టిన ఈ నెగిటివిటి మాత్రం ఆగడం లేదు. చాల పొలిటికల్ పార్టీలు వందల మందిని రిక్రూట్ చేసుకొని ప్రత్యర్థి పార్టీపై జనాల్లోకి నెగిటివిటి స్ప్రెడ్ చేసేందుకు వాడుతున్నారు. 

 

సోషల్ మీడియా ను కంట్రోల్ చేయడానికి కొంత మంది మేధావులు ఒక చట్టం తేవాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. సోషల్ మీడియాను మంచిగా వాడితే ఎటువంటి నష్టం ఉండదు. కానీ చెడుగా వాడితే మాత్రం శిక్షలు భయంకరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ బిల్లు వస్తే మాత్రం దాదాపు 80 శాతం వరకు యూట్యూబ్ చానెల్స్ పెర్మనెంట్ గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి పార్టీకి కొన్ని వందల చానెల్స్ ఉన్నాయి. ఎవరికీ వారే వారికి అనుకూలమైన న్యూస్ మాత్రమే చెబుతారు. 

 

ఈ బిల్లు ను విమర్శించే వారు కూడ ఉన్నారు. ప్రజల స్వేచ్ఛను హారిస్తుంది అని చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈ చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ చట్టం వల్ల ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. 

Leave a Comment

Vedika Media