ఎస్‌కెఎన్ తెలుగు హీరోయిన్స్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్
నిర్మాత ఎస్‌కెఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత, స్టేజ్‌పై చేసే వ్యాఖ్యలతో తరచూ సంచలనాలు సృష్టిస్తుంటారు. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి.

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. లవ్ టుడే సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో, ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఇందులో భాగంగా, హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత ఎస్‌కెఎన్ పాల్గొన్నారు.
ఎస్‌కెఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ ఈవెంట్‌లో హీరోయిన్ కాయడు లోహర్ గురించి మాట్లాడిన ఎస్‌కెఎన్,
“మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్వాగతం. మేము టాలీవుడ్‌లో వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం.”
అని పేర్కొన్నారు. అంతేకాదు,
“తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది. ఇకపై నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి తెలుగు రాని హీరోయిన్లనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాం.”
అని తెలిపారు.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించేనా?
ఎస్‌కెఎన్ వ్యాఖ్యలు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే అని నెటిజన్లు ఊహిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాకు ఎస్‌కెఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు.
మరి, ఎస్‌కెఎన్ కామెంట్స్ వైష్ణవి చైతన్య గురించేనా, లేక మరెవరైనా హీరోయిన్ల గురించి చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఎస్‌కెఎన్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.