• Home
  • Andhra Pradesh
  • సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి.. చంద్రబాబు ఎమోషనల్ మెసేజ్‌తో పాటు భారీ పరిహారం!
Image

సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి.. చంద్రబాబు ఎమోషనల్ మెసేజ్‌తో పాటు భారీ పరిహారం!

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద ఉన్న భక్తులపై భారీ గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీవ్ర వర్షాల కారణంగా ఊహించని ప్రమాదం జరిగిందని, జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదంపై మంత్రి స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్‌, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు, ఎంపీ భరత్‌, అశోక్ గజపతి రాజుతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షలు పరిహారంగా ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply