సిద్ధార్థ్ సూర్య నారాయణ్ — ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు. తన సినీ ప్రయాణాన్ని తమిళ సినిమా ‘బాయ్స్’తో ప్రారంభించిన సిద్ధార్థ్, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి హిట్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు. ‘రంగ్ దే బసంతి’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. వరుస డిజాస్టర్లతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా, తాజాగా విభిన్నమైన కథలతో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రస్తుతం ‘టెస్ట్’ అనే చిత్రంలో నటిస్తున్న ఆయనతో పాటు ఆర్. మాధవన్, నయనతార ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో ‘మహా సముద్రం’ చిత్రంలో కలిసి నటించిన అదితి రావు హైదరీతో ప్రేమలో పడి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. గతంలో మేఘనా నారాయణ్‌ను వివాహం చేసుకున్నా, విభేదాల వల్ల విడాకులు తీసుకున్నాడు.

నివేదికల ప్రకారం సిద్ధార్థ్ నికర ఆస్తి విలువ ₹70 కోట్లు కాగా, అదితి రావుతో కలిపి ఇది ₹130 కోట్లను దాటుతుందని అంచనా.

సినిమాల ఫీజులు, నిర్మాతగా చేసిన పనులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్నాడు.