డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలక మలుపు తిప్పగా, కథానాయిక షాలిని పాండేకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే, అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించినప్పటికీ షాలినికి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో కనిపించినా, టాప్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. దీంతో, ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి కేంద్రీకరించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాలిని “అలియా భట్‌తో పోల్చడం అస్సలు నచ్చదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. “ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. కానీ కొంతమంది అభిమానులు నన్ను అలియా భట్‌తో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఇప్పటికే అలియా భట్ ఉన్నారు. మరొకరు అలియాలా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె అద్భుతమైన నటి. నేను ఆమెను స్పూర్తిగా తీసుకుంటాను, కానీ నా ప్రత్యేకతను నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను” అని షాలిని చెప్పింది.
ఇటీవల, షాలిని “డబ్బా కార్టెల్” వెబ్‌సిరీస్ ద్వారా బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సిరీస్‌లో షబానా అజ్మీ, జ్యోతిక కీలకపాత్రల్లో నటించగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో పలు ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.
టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువగా రావడంపై ఆమె స్పందిస్తూ, “ఒక హిట్ సినిమా తర్వాత హీరోయిన్స్‌కి వరుస ఆఫర్లు రావడం సాధారణమే. కానీ, నా కెరీర్‌లో అలా జరగలేదు. అయినా, నేను నిరుత్సాహపడను. నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తా” అని పేర్కొంది.
ప్రస్తుతం షాలిని బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఆమె నటన, టాలెంట్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి!














