ప్రతి మనిషికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం వింత వింత అలవాట్లు ఉంటాయి. ఇక చెడు అలవాట్లు ఉంటే చాలు… చర్చలకు కొదవుండదు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ తనకున్న ఓ అలవాటు గురించి బహిరంగంగా చెప్పి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. “హీరోయిన్ అయి కూడా ఇలాంటి అలవాటు ఏమిటి?” అంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఆమె నిజాయితీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ హీరోయిన్ మరెవరో కాదు… సంయుక్త మీనన్. 2016లో మలయాళ సినిమా పాప్‌కార్న్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులో భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష వంటి హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి స్వయంభు సినిమాలో నటిస్తున్న సంయుక్త, బింబిసార 2 లో కూడా నటించే అవకాశం ఉంది.
ఇటీవల సంయుక్త మాట్లాడుతూ – “నాకు మద్యం తాగే అలవాటు ఉంది. కానీ ప్రతి రోజు కాదు. ఒత్తిడిగా లేదా ఆందోళనగా అనిపించినప్పుడు కొద్దిగా తీసుకుంటాను” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ఓపెనెస్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.