అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార, వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని తన అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా స్థిరపడింది.

టాలీవుడ్లో ఈ బ్యూటీకి స్టార్ హీరోలకు ఉండేంత ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. తన అందం, అభినయం, శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రెండు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి కెరీర్‌కి రీ-ఎంట్రీ ఇచ్చిన సమంత, వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వరుసగా అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో చాలా తక్కువ ప్రాజెక్టులకు మాత్రమే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

సినిమాలు ఎక్కువగా చేయకపోయినా, సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలో ఈ ముద్దుగుమ్మే మొదటి స్థానం దక్కించుకుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత, రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా సింపుల్‌గా, అద్భుతంగా కనిపించింది. అంతేకాదు, ఓటీటీ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన సమంత, తన శారీ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ, ఫ్యాన్స్ నుంచి పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నాయి.














