సమంత: ‘వాస్తవాలు బయటకు రావాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’
సూపర్ స్టార్ హీరోయిన్ సమంత గతంలో వరుసగా సినిమాలు చేసినా, ఇప్పుడు మాత్రం సెలెక్టివ్‌గాOnly సినిమాలు చేస్తూ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. గతేడాది ఆమె నటించిన “సిటాడెల్: హనీ బన్నీ” వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సమంత తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ విషయాలను పంచుకోవడంతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ర్యాగింగ్ ఘటనపై సమంత తీవ్ర స్పందన:
ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై నటి సమంత స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
సమంత ఏమన్నారంటే?
‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన ప్రవర్తన కారణంగా ఓ విద్యార్థి తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. హేళన, వేధింపులు, ర్యాగింగ్ ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మనకు చెబుతోంది.
మన దేశంలో ర్యాగింగ్ నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ, బాధితులు తమ సమస్యలను బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఇక్కడే మనం విఫలమవుతున్నాం.
ఈ ఘటనపై సంతాపం తెలిపేంతటితో ఆగిపోకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. సంబంధిత అధికారులు ఈ కేసును సమగ్రంగా పరిశీలించి, నిజానిజాలు వెలుగులోకి తేవాలి. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి.
అలాగే, ఎవరికైనా బెదిరింపులు, వేధింపులు, అవమానం ఎదురైతే, దాన్ని ధైర్యంగా బయట పెట్టాలి. బాధితులకు మద్దతుగా నిలిచి, ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సమంత స్పష్టం చేసింది.
https://www.instagram.com/p/DFczk3-yZ18/?utm_source=ig_web_copy_link
