సినిమాలకి బ్రేక్ ఇచ్చినా అభిమానులను మిస్ కాని సమంత!
ట్రెండింగ్‌లో ఎలా ఉండాలో తెలిసినప్పుడు సినిమాలు చేసినా చేయకపోయినా పెద్దగా ఫరక్ పడదు. ప్రస్తుతం సమంత అదే చేస్తున్నది. దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయకపోయినా.. కనబడకపోయినా, రెగ్యులర్‌గా పబ్లిక్ ఈవెంట్స్‌లో హాజరై అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

ఇటీవల చెన్నైకి వెళ్లిన సమంత, అక్కడ ఏమి చేసారో తెలుసా?
సమంతకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సినిమాలు చేసినా, చేయకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సమంత పేరు మరోసారి వైరల్ అవుతోంది.

సత్యభామ యూనివర్సిటీకి వెళ్లిన సమంత
సమంత ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ, మోటివేషనల్ విషయాలను పంచుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా అదే యూనివర్సిటీకి వెళ్లిన సమంత, విద్యార్థులతో సినీ అనుభవాలు, జీవిత పాఠాలను చర్చించారు.

ఈసారి కూడా స్టూడెంట్స్‌తో చాలా సమయం గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలకు గ్యాప్ – వెబ్ సిరీస్‌లపై ఫోకస్
ప్రస్తుతం సమంత దక్షిణ భారత సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేయడం లేదు. ఆమె పూర్తిగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం “రక్త్ బ్రహ్మాండ్” అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

దాంతో పాటు మరిన్ని వెబ్ ప్రాజెక్ట్‌ల కోసం కథలు వింటున్నారు. ఈ గ్యాప్‌లో అప్పుడప్పుడూ అభిమానుల మధ్యకు వస్తూ కనెక్ట్ అవుతున్నారు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. పబ్లిక్ ఈవెంట్స్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూ, వారి ప్రేమను పొందుతున్నారు.
