జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన ఈ ఘోర ఘటనపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ స్పందించారు. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఉద్వేగంతో ట్వీట్ చేశారు.

సాయి పల్లవి ట్వీట్ చేస్తూ – “పహల్గాం దాడిలో జరిగిన నష్టం, భయం నాకు వ్యక్తిగతంగా అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన హింసా ఘటనలు ఇప్పటికీ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటువంటి జంతువుల సమూహం మిగిలిన కొద్దిపాటి ఆశను కూడా నాశనం చేసింది. నా ప్రగాఢ సంతాపం బాధిత కుటుంబాలకు” అని పేర్కొన్నారు.
అయితే సాయి పల్లవి చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్‌పై నెటిజన్లు రెండు విధాలుగా స్పందిస్తున్నారు. గతంలో ఆమె మన ఆర్మీపై చేసిన వ్యాఖ్యల వీడియోను నెట్లో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీరీ పండితులపై దాడిని, గోవుల పేరిట హింసను పోల్చడాన్ని మరోసారి గుర్తు చేస్తూ చర్చ జోరుగా సాగుతోంది.