హైదరాబాద్, ఏప్రిల్ 29: భారతీయ రైల్వేశాఖకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పక పాటించాల్సిందిగా RRB స్పష్టం చేసింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిషేధిత వస్తువులు తీసుకురావద్దని అధికారిక ప్రకటనలో హెచ్చరించింది.

పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు, హెల్త్ బ్యాండ్‌లు, క్యాలిక్యులేటర్లు, పుస్తకాలు, పెన్, పేపర్, పెన్సిల్, స్కేలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాచీలు, కెమెరాలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వంటివి తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది.
అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఈ-కాల్ లెటర్ మాత్రమే తీసుకురావాలి. పరీక్ష సమయంలో పెన్లు ఆర్ఆర్బీ సిబ్బంది అందిస్తారు. గోరింటాకు, హెన్నా, మంగళసూత్రం, గాజులు, ఆభరణాలు వంటివి ఉంటే వాటికి ప్రత్యేక అనుమతి ఉండాలి, లేకపోతే పరీక్షా హాల్లోకి అనుమతించబడదు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే పరీక్షకు అనర్హులు కాగల అవకాశం ఉంది.