రోహిత్-విరాట్ ఆనందం హద్దులు దాటి… స్టంప్‌లతో కోలాటం!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నది. 2013 తర్వాత, ఈ ప్రెస్టీజియస్ ట్రోఫీని మరోసారి భారత్ అందుకుంది.

ట్రోఫీ గెలిచిన ఆనందంలో, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ తమ సంతోషాన్ని విపరీతంగా వ్యక్తపరిచారు. వికెట్లు పీకి, స్టంప్‌లతో కోలాటం ఆడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోట్లాది మంది అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు.

ఫైనల్ మ్యాచ్ హైలైట్స్
దుబాయ్ మైదానంలో న్యూజిలాండ్ 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఈ ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ మాత్రం 1 పరుగు మాత్రమే చేశాడు. అయినా, భారత్ వరుసగా రెండోసారి ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడం వీరి ఆనందానికి అవధులు లేకుండా చేసింది.
న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 63 పరుగులు చేయగా, మైఖేల్ బ్రేస్‌వెల్ 53 పరుగులు చేశాడు. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరకు 49 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
భారత జట్టు :
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- శుభ్‌మన్ గిల్
- విరాట్ కోహ్లీ
- శ్రేయాస్ అయ్యర్
- అక్షర్ పటేల్
- కేఎల్ రాహుల్ (కీపర్)
- హార్దిక్ పాండ్యా
- రవీంద్ర జడేజా
- మహ్మద్ షమీ
- కుల్దీప్ యాదవ్
- వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ జట్టు :
- విల్ యంగ్
- రాచిన్ రవీంద్ర
- కేన్ విలియమ్సన్
- డారిల్ మిచెల్
- టామ్ లాథమ్ (కీపర్)
- గ్లెన్ ఫిలిప్స్
- మైఖేల్ బ్రేస్‌వెల్
- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్)
- కైల్ జామిసన్
- విలియం ఓరూర్కే
- నాథన్ స్మిత్
ఈ విజయం భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. రోహిత్-కోహ్లీ స్టంప్‌లతో కోలాటం ఆడిన వీడియో వైరల్‌గా మారి, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.