ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి ఇటీవల పబ్లిక్‌లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధుర క్షణాల్లో ఆయన భార్య రితికా సజ్దేహ్, కుమార్తె సమైరా, కొడుకు అహాన్ శర్మతో కలిసి విమానాశ్రయంలో నడుస్తూ కనిపించారు. వీరిని చూసిన అభిమానులు ఫుల్ ఫీల్ అయ్యారు. ప్రత్యేకంగా రితికా ఒడిలో ఉన్న చిన్నారి అహాన్‌ను ముద్దుగా చూసే విధానం అందరి హృదయాలను హత్తుకుంది. అహాన్ బుగ్గలు, గుండ్రని ముఖం చూసి నెటిజన్లు “అచ్చం రోహిత్ శర్మలాగే ఉన్నాడు.. ప్రింట్ గుద్దేశాడు” అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

అహాన్ శర్మ ఈ ఏడాది ప్రారంభంలో జన్మించాడు. అప్పట్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉన్నారు. కానీ కుటుంబ బాధ్యతలు పూర్తి చేసుకుని మళ్లీ జట్టులో చేరి ఆస్ట్రేలియాతో చివరి టెస్టుల్లో పాల్గొన్నారు. దేశ సేవతో పాటు కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా రోహిత్ వ్యక్తిత్వంలో ఉన్న మానవీయతను అభిమానులు మెచ్చుకుంటున్నారు.
ఇక ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మకు పెద్దగా ఫామ్ లేదు. మోకాలి గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లోనూ నిలకడ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. డిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యారు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 56 పరుగులే చేసి, ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయారు.

LSGతో మ్యాచ్‌కు గాయం కారణంగా ఆడలేకపోయిన రోహిత్ శర్మ లేకుండానే ముంబై ఇండియన్స్ జట్టు డిల్లీపై విజయం సాధించింది. వచ్చే మ్యాచ్ ఏప్రిల్ 17న SRHతో జరగనుండగా, రోహిత్ తిరిగి జట్టులోకి వస్తాడా అనే ఆసక్తి నెలకొంది.
మొత్తానికి రోహిత్ శర్మ ఒకవైపు ఫామ్ కోసం పోరాడుతున్నా, కుటుంబం, ముఖ్యంగా తన కుమారుడు అహాన్‌తో గడిపిన మధుర క్షణాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. ‘హిట్ మ్యాన్ వారసుడు అచ్చం డాడీలా ఉన్నాడు’ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడీ చిన్నారి స్టార్ టాక్ అవుతున్నాడు.