• Home
  • Telangana
  • CM రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా – ఖమ్మం యువకుడి వినూత్న నిర్ణయం…!!
Image

CM రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా – ఖమ్మం యువకుడి వినూత్న నిర్ణయం…!!

ఖమ్మం జిల్లాలో ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డికి తన అంకితభావాన్ని నిరూపించేందుకు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కారేపల్లి మండలం మేకల తండకు చెందిన భూక్య గణేష్ అనే యువకుడు – కాంగ్రెస్ పార్టీకి క్రియాశీల కార్యకర్త. సీఎం రేవంత్ రెడ్డి అంటే గణేష్‌కు అపారమైన అభిమానమట. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందంటే, “రేవంత్ రెడ్డి నా పెళ్లికి వస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటా, లేదంటే పెళ్లి పీఠలెక్కను” అని భీష్మ విగ్రహంగా కూర్చున్నాడు.

గణేష్ ముద్దుల కూతురిని మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతితో మార్చి 6న నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ పెళ్లి ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కారణం ఒక్కటే – రేవంత్ రెడ్డి హాజరవుతారన్న నమ్మకంతో అతను వేచి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తారో చూసుకుని ఆ రోజునే ముహూర్తం పెట్టుకుంటానని తేల్చి చెప్పాడు.

ఇంతటితో ఆగకుండా, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్‌కు వినతిపత్రం అందజేసి – సీఎం రేవంత్‌తో పాటు జిల్లాలోని ముగ్గురు మంత్రులు కూడా తన పెళ్లికి రావాలంటూ అభ్యర్థించాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా తన అభిమానానికి అంకితమై ఉన్నాడు గణేష్. ప్రజాప్రతినిధులకు అభిమానులు ఉండడం సహజమే కానీ, ఇది కొంచెం వినూత్నంగా ఉంది అని అంటున్నారు స్థానికులు.

ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ – “ఈ యువకుడి ఆహ్వానంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు?” అనే ప్రశ్న.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply